రాయ్‌బరేలీలో రేపు సోనియా నామినేషన్
రాయ్‌బరేలీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాయబరేలి లోక్‌సభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు సోమవారం నామినేషన్ వేయనున్నారు. కుమారుడు రాహూల్ గాంధీ, కుమార్తె ప్రియాంక వధేరాలతో సోనియా నామినేషన్ దాఖలు చేస్తారని కాంగ్రెస్ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. మే 8న ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. కుటుంబ సభ్యులతో రేపు ఉదయం సోనియా రాయబరేలి చేరుకుంటారు. ఎంపిల జోడు పదవుల వ్యవహారంపై విమర్శలు చెలరేగడంతో సోనియా లోక్‌సభ సభ్యత్వానికి, ఇతర పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications