కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్‌లకు జలగండం
హైదరాబాద్: నిన్నటివరకు ఉత్తరాంధ్రను వణికించిన వాయుగుండం ఇప్పుడు ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ప్రతాపం చూపిస్తోంది. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మరో 24 గంటల సేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు శనివారం మధ్యాహ్నం తెలియజేశారు. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం వద్ద గోదావరి ప్రవాహం ఉద్దృతంగా ఉంది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. శ్రీరాం సాగర్ ఇన్‌ఫ్లో శనివారం సాయంత్రానికి 4 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశముంది. భారీ వర్షాల కారణంగా నిజామాబాద్‌లోని అనేక వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.












Click it and Unblock the Notifications