త్వరలో తెలంగాణ విజయోత్సవాలు: నరేంద్ర
హైదరాబాద్: తాము త్వరలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి విజయోత్సవాలు జరుపుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర మంగళవారం ఇక్కడ చెప్పారు. హైదరాబాద్‌లో నిన్న ప్రారంభించిన తెలంగాణ భవనంలో ఆయన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17 న అసలైన స్వాతంత్య్రం వచ్చిందని, అప్పుడు తాము ఘనంగా విజయోత్సవం జరుపుకుంటామని ఆయన చెప్పారు. నిన్న తెలంగాణ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా టిఆర్‌ఎస్ అగ్రనేత చంద్రశేఖరరావు ప్రసంగిస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
