సచిన్ పూర్తి ఫిట్నెస్‌తో వున్నాడు: లీపస్
జైపూర్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫిట్నెస్‌పై వ్యక్తమవుతున్న అనుమానాలను భారత క్రికెట్ జట్టు మాజీ ఫిజియో ఆండ్య్రూ లీపస్ వ్యతిరేకించారు. తన ఫిట్నెస్‌పై పూర్తి నమ్మకం ఏర్పడిన తర్వాతనే సచిన్ ఎంపికకు సిద్ధంగా వుండడానికి ముందుకు వస్తాడని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వంద శాతం ఫిట్నెస్ వున్నప్పుడు మాత్రం సచిన్ ఆడడానికి ముందుకు వస్తాడనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు.
సచిన్ గతంలో మాదిరిగా ఆడగలడా అని అడిగితే కొన్ని జీవసంబంధమైన ప్రక్రియలు మన నియంత్రణలో వుండవని,న గాయాలు మానడానికి సమయం పడుతుందని, ఎవరికైనా గాయాలు కావచ్చునని, చెప్పాల్సి వస్తే వంద శాతం ఫిట్నెస్‌తో వున్నప్పుడు మాత్రమే సచిన్ ముందుకు వస్తాడని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications
