వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డెమ్మీ కెప్టెన్‌గా వుండను: యూనిస్‌ ఖాన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

లాహోర్‌: ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుకు డమ్మీ కెప్టెన్‌గా ఉండబోనని యూనిస్‌ ఖాన్‌ తేల్చి చెప్పాడు. పాకిస్థాన్‌ జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించడానికి యూనిస్‌ ఖాన్‌ నిరాకరించాడు. ఇంజమామ్‌ ఉల్‌ హక్‌పై ఐసిసి నిషేధం విధించిన నేపథ్యంలో యూనిస్‌ ఖాన్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించారు. లాహోర్‌లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశాన్ని ఆయన బహిష్కరించాడు. ఈ సమావేశంలో యూనిస్‌ పాల్గొనాల్సి వుంది. దాంతో అందరూ అవాక్కయ్యారు.

తాను డెమ్మీ కెప్టెన్‌గా ఉండబోనని, తాను కెప్టెన్సీని తిరస్కరించడానికి గల కారణాలను తర్వాత వెల్లడిస్తానని యూనిస్‌ ఖాన్‌ చెప్పాడు. ఈ ప్రకటన చేసిన సమయంలో కోచ్‌ బాబ్‌ వూల్మర్‌ యూనిస్‌ పక్కనే వున్నారు. దీంతో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చిక్కులో పడింది. ఈ విషయంపై చర్చించడానికి పిసిబి చైర్మన్‌ షహర్యర్‌ ఖాన్‌ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. యూనిస్‌ ఆ ప్రకటన చేయడానికి గల కారణాలు తెలియవని, రెగ్యులర్‌ వైస్‌ కెప్టెన్‌ ఆ విధమమైన ప్రకటన చేయడానికి గల కారణాలను తెలుసుకుంటామని పిసిబి ప్రకటించింది. యూనిస్‌తో తాము చర్చలు జరుపుతున్నామని, విషయం తెలిసిన వెంటనే మీడియా తెలియజేస్తామని పిసిబి ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ సలీం అల్తాఫ్‌ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X