కర్నూలులో మందుల కోసం రోశయ్య ఘెరావ్
కర్నూలు: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె. రోశయ్యను సిపిఐ కార్యకర్తలు గురువారంనాడు ఘెరావ్ చేశారు. మాటలు వద్దు, మందులు కావాలి అంటూ వారు మంత్రిని డిమాండ్ చేశారు. చికన్‌గన్యాను, డెంగీని నివారించడంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వారు మంత్రి దృష్టికి తెచ్చారు.
జిల్లా అధికారులు డెంగీ, చికన్‌గన్యా నివారణ చర్యలు తీసుకోవడంలో ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదని ఆందోళనకారులు విమర్శించారు. తాను తగిన చర్యలు తీసుకుంటానని రోశయ్య హామీ ఇచ్చారు. దీంతో సిపిఐ కార్యకర్తలు ఆందోళన విరమించారు. డెంగీ, చికన్‌గన్యా నివారణ చర్యల పట్ల అధికారులను అప్రమత్తం చేయడానికి మంత్రి కర్నూలుకు వచ్చారు.












Click it and Unblock the Notifications