హైదరాబాద్‌లో విశ్వసుందరి జులైకా రివేరా
హైదరాబాద్: ఎయిడ్స్ నివారణ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశ్వసుందరి జులైకా రివేరా హైదరాబాద్ వచ్చారు. ఎయిడ్స్ నివారణ కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. ఎయిడ్స్ నివారణ కోసం తాను భిన్నంగా కృషి చేస్తానని ఆమె చెప్పింది. తాను భారతదేశం వస్తానని ఎప్పుడూ అనుకోలేదని, దేవుడే ఈ కార్యక్రమం కోసం తనను భారత్‌కు రప్పించాడని ఆమె అన్నది. భారత్ చాలా గొప్పగా వుందని ఆమె కొనియాడింది.
నిజాయితీ అంటే తనకెంతో ఇష్టమని, ఆ నిజాయితీ తనకు భారతీయుల్లో కనిపించిందని ఆమె అన్నది. ఎయిడ్స్ నివారణ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం వుందని ఆమె అభిప్రాయపడింది. అంతా ఒక జట్టులా పనిచేస్తే ఎయిడ్స్‌ను నివారించడం కష్టమేమీ కాదని ఆమె చెప్పింది.












Click it and Unblock the Notifications
