అవినీతి నిరోధక సంస్ధ చైర్మన్‌కు అరెస్టు వారెంట్
ఫగ్వారా: అఖిలభారత అవినీతి నిరోధక ఫోరం ప్రెసిడెంట్ పై అవినీతి కేసు దాఖలైంది. ఆ కేసులో పలు సార్లు కోర్టు నోటీసు పంపినా ఆయన హాజరుకాలేదు. దాంతో స్థానిక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. ఆలిండియా యాంటీ కరప్షన్ ఫోరం అధ్యక్షుడు పిఎస్ పస్సీని డిసెంబర్6న కోర్టుకు హాజరు పర్చేందుకు వీలుగా అరెస్ట్ వారంట్ జారీచేస్తూ జడ్జి మంజోత్ కౌర్ ఆదేశాలు జారీ చేసారు. తనపైన ఉన్న దొంగతనం కేసులో తీర్పు తనకు అనుకూలంగా వచ్చేటట్లు చేస్తానని చెప్పి పస్సీ 2002 జనవరి 15న తనవద్ద 30 వేలరూపాయలు తీసుకున్నట్లు ఆరోపిస్తూ నిర్మల్‌సింగ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖరాస్తూ, అఫిడవిట్లు పంపారు.
ఆ కేసు తుదిదశలో ఉండగా 2002 జనవరి 14న పస్సీ తనను కలిసి సబ్‌డివిజినల్ జుడీషియల్ మెజిస్ట్రేట్ హర్బజన్‌దాస్‌తో తనకు సన్నిహిత సంబంధం ఉందని పేర్కొంటూ డబ్బు డిమాండ్ చేశాడని నిర్మల్‌సింగ్ తెలిపారు. డబ్బు తగిన సమయంలో ఇవ్వాలని పస్సీ కోరారని, డబ్బు చెల్లించామని, అయినా తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చిందని అతడు పేర్కొన్నాడు. తర్వాత పస్సీ డబ్బువాపస్ ఇచ్చేందుకు అంగీకరించలేదని, తాను పోలీసులకు ఫిర్యాదుచేస్తే పోలీసు పెద్దలు పస్సీకి క్లీన్‌చిట్ ఇచ్చి తనను వేధంచడం ఆరంభించాడని నిర్మల్‌సింగ్ కోరారు. నిర్మల్‌సింగ్ విజ్ఞాపనా పత్రం అనుసరించి ప్రధాన న్యాయమూర్తి కిందికోర్టుకు కేసును పంపించారు.












Click it and Unblock the Notifications