జర్నలిస్టులపై మెడికోల దాడి
కర్నూలు: కర్నూలు మెడికల్ కళాశాల ఆస్పత్రిలో 60 మంది మెడికోలు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగులోకీ వచ్చింది. జర్నలిస్టులను మెడికోలు రాయడానికి వీల్లేని భాషలో తిట్టారు. ఒక మీడియా ప్రతినిధి కెమెరాను లాక్కొని అతడిని మూడు కిలోమీటర్లు దూరం పరుగెత్తించారు.
శుక్రవారం రాత్రి పదకొండున్నరకు ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రికి వచ్చారు. ఆ సమయంలో ఆరుగురు మెడికోలు మాత్రమే విధినిర్వహణలో ఉండాలి. కానీ 20 మంది వరకు ఉండడం, కొందరు తప్పతాగి ఉండడం కన్పించింది. త్వరగా చికిత్స చేయమని పేషెంట్ కోరగా మెడికోలు చిరాకు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. వారిని మెడికోలు తిట్టడమే గాక భౌతిక దాడికి దిగారు.
ఈ సంఘటనపై విలేకరులు అడిషనల్ ఎస్ పి రవీంద్రనాధ్ దృష్టికి తీసుకెళ్ళగా, మెడికోలు పోలీసు స్టేషన్ వద్ద బీభత్సం సృష్టించారు. విలేకరులపై జరిగిన దాడిని జర్నలిస్టుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి.












Click it and Unblock the Notifications