ప్రశాంత్ రెండో భార్య ప్రీతిని విచారించిన సిఐడి
హైదరాబాద్: పిసిసి మాజీ అధ్యక్షుడు కె. కేశవరావు కుమారుడు వెంకట్ ఇంట్లో కాల్పులకు సంబంధించి సిఐడి పోలీసులు గురువారంనాడు మృతుడు ప్రశాంత్ రెడ్డి రెండో భార్య ప్రీతిని విచారించారు. వెంకట్ ఇంట్లో జరిగిన కాల్పుల్లో మరణించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రశాంత్ రెడ్డిని తాను విజయవాడలోని దుర్గా గుడిలో పెళ్లి చేసుకున్నట్లు ప్రీతి ఇదివరకే మీడియా ప్రతినిధులతో చెప్పింది. తమ పెళ్లి ఫొటోను కూడా ఆమె విడుదల చేసింది.
ప్రశాంత్ రెడ్డి మృతి విషయం తెలిసిన వెంటనే ప్రీతి ఆస్పత్రిలో చేరింది. ఇటీవలే ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. సిఐడి పోలీసులు వెంకట్ ను, ఆయన భార్యను ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రశాంత్ రెడ్డి మృతి కేసులో పోలీసులు ఫోరెన్సిక్ నివేదికను కోర్టు సమర్పించారు.












Click it and Unblock the Notifications