Tamil Nadu: విజయ్ సహా మంత్రుల భవిష్యత్తు తేల్చనున్న మద్రాస్ హైకోర్టు..!
ఈ ఏడాది తమిళనాడు (tamil nadu)లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఓ సంచలనం. ఇందులో దశబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న, ఎన్నోసార్లు ప్రభుత్వాలు నడిపిన అనుభవం ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్ని కాదని ప్రజలు విజయ్ కొత్త పార్టీ టీవీకేకు అనుకూలంగా ఓటేశారు. దీంతో టీవీకేకు మెజార్టీ రాకపోయినా మెజార్టీ ప్రజల మొగ్గు విజయ్ వైపే ఉందని తేలిపోయింది. దీంతో చిన్నా చితకా పార్టీల్ని కలుపుకుని విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు మొదలయ్యాయి.
తమిళనాడులో విజయ్ సహా పలువురు విజేతల ఫలితాలను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో అసాధారణంగా భారీ సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. జూన్ 18న గడువు తేదీ లోపు హైకోర్టు రిజిస్ట్రీలో తమిళనాడు ఎన్నికల ఫలితాలపై సుమారు 55 ఎన్నికల పిటిషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం, మద్రాస్ హైకోర్టు నిబంధనలు 1967 ప్రకారం ఎన్నికల పిటిషన్లకు నంబర్ కేటాయించే ముందు వాటిపై కఠినమైన పరిశీలన చేస్తారు. ఫలితాలు వెలువడిన 45 రోజులలోపు పిటిషనర్లు ఈ కేసులను స్వయంగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు లేదా తమ నియోజకవర్గంలోని ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ ఏదైనా ఒక ఓటరు కూడా ఈ పిటిషన్లను దాఖలు చేయవచ్చు. అలా ఈసారి విజయ్ పోటీ చేసిన పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు ఓటర్లు ఆయన విజయాన్ని సవాలు చేస్తూ ఎన్నికల పిటిషన్లను దాఖలు చేశారు.

అలాగే చెపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుండి ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విజయాన్ని, అలాగే విల్లివాక్కం, గోబిచెట్టిపాళయం, డాక్టర్ రాధాకృష్ణన్ నగర్ నియోజకవర్గాల నుండి వరుసగా మంత్రులు ఆధవ్ అర్జున, కె.ఎ.సెంగోట్టయన్ , ఎన్. మేరీ విల్సన్ విజయాలను సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఓడిపోయిన అభ్యర్థి పి.మిలానీ.. ఉదయనిధి ఎన్నికను సవాలు చేయగా; ఆధవ్ అర్జున విజయాన్ని సవాలు చేస్తూ రెండు పిటిషన్లు దాఖలయ్యాయి - ఒకటి ఓడిపోయిన డీఎంకే అభ్యర్థి కార్తీక్ మోహన్ ద్వారా, మరొకటి ఓటరు ఆర్.శివరాజ్ ద్వారా. అలాగే సెంగోట్టయన్ విజయాన్ని అన్నాడీఎంకేకు చెందిన ఓడిపోయిన అభ్యర్థి వి.బి.ప్రభు సవాలు చేశారు. ఈ ఏడాది హైకోర్టులో దాఖలైన ఎన్నికల పిటిషన్ల సంఖ్య భారీగా ఉంద ి కోర్టు అధికారులు తెలిపారు. ఎందుకంటే 2011 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేవలం 12 పిటిషన్లు మాత్రమే స్వీకరింగా, 2016 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 23 పిటిషన్లు నమోదయ్యాయి. 2021లో కేవలం 13 పిటిషన్లు మాత్రమే విచారణకు స్వీకరించారు.














Click it and Unblock the Notifications