ఎపిఐసిసి భూముల వేలానికి నిరసన: అరెస్టులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఎపిఐసిసి) భూముల వేలాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. వామపక్షాల కార్యకర్తలు, నేతలతో పాటు తెలుగుదేశం, బిజెపి, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, కార్యకర్తలు తొలుత ర్యాలీ నిర్వహించి, అనంతరం ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
ప్రతిపక్షాల ఆందోళనతో భూముల వేలం మధ్యాహ్నం వరకు ప్రారంభం కాలేదు. ప్రభుత్వం భూములను వేలం వేయడాన్ని అడ్డుకోవడంతో పాటు భూపోరాటం సాగిస్తామని ప్రతిపక్షాలు అంటున్నాయి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ముందుకు రాని ప్రభుత్వం భూములను వేలం వేస్తోందని ప్రతిపక్షాల నాయకులు విమర్శించారు. తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని వారు చెప్పారు. వేలంలో కొనుక్కున్న భూముల్లో కూడా జెండాలు పాతుతామని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications