తిరుపతయ్య ఇంటిపై ఎసిబి దాడులు
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని వనస్థలిపురంలో పశు సంవర్ధక శాఖ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ తిరుపతయ్య ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు శుక్రవారంనాడు దాడి నిర్వహించారు. ఈ దాడిలో తిరుపతయ్య అక్రమాస్తులున్నట్లు ఎసిబి అధికారులు కనుక్కున్నారు. తిరుపతయ్యకు దాదాపు 50 లక్షల రూపాయల అక్రమాస్తులున్నట్లు తేల్చారు.
మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరు గ్రామంలో తిరుపతయ్యకు పది ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు వారు కనిపెట్టారు. అంతేకాకుండా తిరుపతయ్యకు కరీంనగర్, గద్వాలల్లో ప్లాట్లు ఉన్నట్లు ఈ దాడుల్లో తేలింది.












Click it and Unblock the Notifications