చిరు తృతీయ ఫ్రంటు నాయకత్వం సందేహమే: ఎర్రం
విశాఖపట్నం: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రంలో తృతీయ ఫ్రంట్ కు నాయకత్వం వహిస్తారని అనుకోవడం లేదని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టిడిపిపి) నాయకుడు కె. ఎర్రంనాయుడు అన్నారు. తాము వామపక్షాలను ఆకర్షించి వారితో కలిసి పని చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆదరాబాదరాగా పథకాలను ప్రకటిస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రిది ప్రచార ఆర్భాటమే ఎక్కువని, ప్రజల బాధలు పట్టవని ఆయన అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. రామసేతు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రత్యామ్నాయాలు చూడాలని ఆయన అన్నారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం తేల్చాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications