యుఎన్ వద్ద సోనియాకు ఎదురైన నిరసన
న్యూయార్క్: ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) చైర్ పర్సన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఐక్య రాజ్య సమితి(యుఎన్) వద్ద నిరసన ఎదురైంది. గాంధీ హెరిటేజ్ ఫౌండేషన్ కు చెందిన వంద మంది ఐక్య రాజ్య సమితి వెలుపల నిరసన ప్రదర్శన చేశారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా భారత ప్రతినిధిగా ఐక్య రాజ్య సమితిలో సోనియా గాంధీ ప్రసంగం చేయడాన్ని వారు వ్యతిరేకించారు.
మహాత్మా గాంధీకి సోనియాకు సంబంధం లేదని ఆందోళనకారులు అన్నారు. భారత ప్రతినిధిగా సోనియాను ఐక్య రాజ్యసమితికి పంపడం అర్థం లేనిదని వారన్నారు. మహాత్మా గాంధీ హిందువని, సోనియా కారని, మహాత్మాగాంధీ సత్యానికి, అహింసకు కట్టబడి ఉన్నారని, సోనియాకు సత్యంపై నమ్మకం లేదని, సోనియా ఎన్నో అబద్ధాలు ఆడారని నారాయణ్ కటారియా అనే ఆందోళనకారుడు అన్నారు. సోనియా భారతదేశానికి చెందినవారు కారని, ఇటలీకి చెందిన వారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
