విశ్వనాధన్ ఆనంద్ కు రూ. 25 లక్షలు
చెన్నై: ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాధన్ ఆనంద్ కు తమిళనాడు ప్రభుత్వం నగదు బహుమతిని ప్రకటించింది. ఆనంద్ కు 25 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. క్రికెటర్లకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తూ తమను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తుండడంపై ఇతర క్రీడలకు చెందినవారిలో అసంతృప్తి నెలకొంది. ఈ స్థితిలో తమిళనాడు ప్రభుత్వం విశ్వనాధన్ ఆనంద్ కు నగదు బహుమతిని ప్రకటించింది.
ఇతర క్రీడాకారులకు కూడా తమిళనాడు ప్రభుత్వం నగదు బహుమతులు ప్రకటించింది. ఆసియా, కామన్ వెల్త్ క్రీడల్లో విజయాలు సాధించినవారికి ఈ నగదు బహుమతులు ప్రకటించింది. 28 మంది క్రీడాకారులకు 96 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రభుత్వం ప్రకటించింది.












Click it and Unblock the Notifications