ముఠా కక్షలకు ముగ్గురు బలి
కర్నూలు: కర్నూలు జిల్లాలో మరోసారి ఫాక్షన్ కక్షలు పడగ విప్పాయి. ఈ కక్షలకు ముగ్గురు బలయ్యారు. మరో ఇద్దరు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం కున్నూరు గ్రామంలో ఈ దారుణం జరిగింది. ప్రత్యర్థుల దాడిలో వెంకటేశ్వర్లు, శ్రీరాములు, హనుమంతు అనే ముగ్గురు మృత్యువాత పడ్డారు.
గతంలో సిద్ధప్పకు చెందిన పందులు చనిపోయాయి. వాటిని వెంకటేశ్వర్లు వర్గం చంపిందనేది సిద్ధప్ప ఆరోపణ. ఈ విషయంపై ఇరు వర్గాలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నాయి. దాంతో పగలు చల్లారలేదు. గురువారం రాత్రి సిద్ధప్ప వర్గానికి చెందిన 20 మంది వెంకటేశ్వర్లుపై, అతని అనుచరులపై దాడి చేశారు. నిందితులు పరారీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications