క్రికెట్ మ్యాచ్ ను తిలకించిన వైయస్
హైదరాబాద్: హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మూడో వన్డే క్రికెట్ మ్యాచును ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తిలకించారు. శుక్రవారం నాలుగు గంటల ప్రాంతంలో ఆయన ఉప్పల్ స్టేడియానికి వచ్చి మ్యాచును చూశారు. అప్పటికే భారత్ ఓటమి అంచున ఉంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచుకు పలువురు ప్రముఖులు వచ్చారు.
హీరో బాలకృష్ణ కూడా మ్యాచును తిలకించడానికి వచ్చారు. భారత్ కు విజయం చేకూరాలని ఆయన ఆకాక్షించారు. భారత జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ కూడా పొద్దునే మ్యాచును చూడడానికి వచ్చారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి, పోలీసాఫీసర్ ఖాన్ తదితరులు మ్యాచును తిలకించడానికి వచ్చినవారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications