మలేషియాలో భారతీయులకు చిత్రహింసలు
కౌలాలంపూర్: మలేషియాలో 200 మందికిపైగా భారతీయులు చిత్రహింసలకు గురవుతున్నారు. మలేషియాలోని జోహారా రాష్ట్రంలో సెనాయ్‌లో ఉన్న కార్మాగారంలో కార్మికులుగా పని చేస్తున్న వీరందరూ వారికి ఉద్యోగాలు ఇప్పించిన ఏజెంట్‌చే చిత్రహింసలకు గురవుతున్నారు. 264 మంది భారతీయ కార్మికులు రెండేళ్ల క్రితం ఇక్కడి కర్మాగారంలో పనికి చేరారు.
అక్కడ చేరినప్పటి నుంచి తమ ఏజెంట్ వేదిస్తున్నాడని కార్మికులు చెబుతున్నారు. ముగ్గురు భారతీయ కార్మికులను ఈ ఏజెంట్ గొడ్డును కొట్టినట్లు కొట్టడంతో భయపడినపోయిన మిగిలిన కార్మికులు భారత్ తిరిగి వచ్చేందుకు సాయం చేయాలని కోరుతున్నారు.
తమకు ఇస్తున్న రూ. 25 హాస్టల్ క్యాంటీన్ ఆహారం వద్దని, తమ జీతం నుంచి రోజూ ఆ డబ్బు తీసుకోవడంపై ఈ ముగ్గురు కార్మికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా చేసినందుకు వారితో ఏజెంట్ హింసాత్మకంగా వ్యవహరించాడని మిగిలిన కార్మికులు వాపోయారు.












Click it and Unblock the Notifications