వైఎస్ ను కలిసిన ప్రైవేటు బస్సు యజమానులు
హైదరాబాద్: ప్రైవేటు బస్సులను సీజ్ చేయడంపై ప్రైవేటు బస్సు యజమానుల ఆందోళన తీవ్రతరమైంది. అన్ని అనుమతులు ఉన్నా తమను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని నేడు ఆశ్రయించారు. రవాణా శాఖ అధికారులు తమను దొంగలుగా చిత్రీకరిస్తున్నారంటూ ఆక్రోశం వెలిబుచ్చారు.
ముఖ్యమంత్రిని కలిసిన ప్రైవేటు బస్సు యజమానులు తమపై దాడులు ఆపకపోతే న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో కార్మిక సంఘాలు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం గమనించవలసిన విషయం. ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు ముఖ్యమంత్రిని కలిసి సంఘీవం ప్రకటించారు.












Click it and Unblock the Notifications