వైయస్, బాబు దొందూదొందే: దత్తాత్రేయ
విజయవాడ: ఆస్తులపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు చౌకబారు రాజకీయమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ విమర్శించారు. ఇరువురి ఆస్తులపై సిట్టింగు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన బుధవారం విజయవాడలో డిమాండు చేశారు.
వైయస్, చంద్రబాబు ఇద్దరూ అవినీతిపరులేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. అన్యమత ప్రచారానికి నిరసనగా నవంబర్ 1వ తేదీన చలో తిరుపతి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications