Schools closed news: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు స్కూళ్లకు సెలవు..

ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైతో సహా గుజరాత్, ఏపీ, తెలంగాణ ఇలా అనేక రాష్ట్రాల్లో వర్షాలు నమోదవుతున్నాయి. దిల్లీతో పాటు పరిసర ప్రాంతాలైన నోయిడా, గురుగ్రామ్ లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. వచ్చే వారం రోజుల పాటు దిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) పేర్కొంది.

అయితే ఐఎండీ అంచనాల నేపథ్యంలో జూలై 6 సోమవారం పాఠశాలలకు సెలవు ఉంటుందా..? లేదా..? అని అటు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యూకేషన్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ కోసం చూస్తున్నారు. అలాగే సంబంధిత పాఠశాలల యాజమాన్యాన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

అటు దేశ ఆర్థిక ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు, కాలనీలు జలమయం అయ్యాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రజలు, అధికారులను అప్రమత్తం చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం ఒక్కరోజే కేవలం 12 గంటల వ్యవధిలోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటం, రోడ్లు కుంగిపోవడం, కొన్ని పాత ఇళ్లకు నష్టం కలగడం తదితర ఘటనలు చోటుచేసుకున్నాయి.

Schools Delhi Rains Inundate City Schools Likely to Declare Holiday Tomorrow DueSevere Waterlogging

ఈ క్రమంలో ముంబైలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేశారు అధికారులు. దాదాపు 10 వేల మందికి పైగా సిబ్బందిని సహాయక చర్యల కోసం మోహరించారు. ఇక ముంబైతోపాటు పుణెలోనూ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఆదివారం కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచనలు చేసింది. దాంతో ముంబై, పుణెలో పాఠశాలలకు సెలవు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+