విచిత్ర మలుపు తిరిగిన రియల్టర్ కిడ్నాప్
హైదరాబాద్: హైదరాబాదులోని ఎల్.బి. నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి జగదీష్ అపహరణకు గురైనట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు, వ్యాపార భాగస్వాములు కలిసి తన భర్తను కిడ్నాప్ చేశారని జగదీష్ భార్య ఆరోపించారు. బుధవారం ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో నలుగురు వ్యక్తులు వచ్చి తాము టాస్కుఫోర్స్ పోలీసులమని చెప్పి తన భర్తను బలవంతంగా తీసికెళ్లారని, తన భర్తను వారు కొట్టుకుండా టాటా సుమోలో తీసుకెళ్లారని ఆమె ఆరోపించారు.
తన భర్త కిడ్నాప్ పై ఆమె ఎల్.బి. నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానికంగా కలకలం చెలరేగింది. తన భర్త వ్యాపార భాగస్వామి రుష్యేందర్ పై జగదీష్ భార్య ఆరోపణలు చేశారు. అయితే కొన్ని గంటల తర్వాత ఈ కిడ్నాప్ ఉదంతం విచిత్రమైన మలుపు తిరిగింది. జగదీష్ పై సంజీవరెడ్డి నగరు పోలీసు స్టేషనులో చీటింగ్ కేసు ఉందని, జగదీష్ ను తామే అదుపులోకి తీసుకున్నామని టాస్కుఫోర్సు పోలీసులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications