వెంకట్ రిమాండ్ 24 వరకు పొడిగింపు
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రశాంత్ రెడ్డి హత్య కేసులో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) మాజీ అధ్యక్షుడు కె. కేశవరావు కుమారుడు వెంకట్ జ్యుడిష్యల్ రిమాండును కోర్టు ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించింది. వెంకట్ ఇంట్లో జరిగిన కాల్పుల్లో ప్రశాంత్ రెడ్డి మరణించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలోనే కేశవరావు పిసిసి అధ్యక్ష పదవిని వదులుకోవాల్సి వచ్చింది.
ప్రశాంత్ రెడ్డి ఇద్దరు భార్యల గొడవలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని వెంకట్ చెబుతూ వచ్చాడు. అయితే ప్రశాంత్ రెడ్డిని తానే చంపానని వెంకట్ సిఐడి పోలీసుల విచారణలో అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. కేసును తప్పు దోవ పట్టించేందుకు కేశవరావు ప్రయత్నిస్తున్నారని ప్రశాంత్ రెడ్డి భార్య మానవ హక్కుల కమీషనుకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని కూడా కోరారు.












Click it and Unblock the Notifications