సంతనకాడు సీరియల్ పై వీరప్పన్ భార్య ఆగ్రహం
చెన్నై: తన భర్తపై మక్కల్ టీవీ సంతనకాడు పేర నిర్మించిన సీరియల్ ను వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి వ్యతిరేకిస్తున్నారు. ఈ సీరియల్ ప్రోమోను టీవీ చానెల్ ఇప్పటికే ప్రసారం చేస్తోంది. ఈ సీరియల్ ను పిఎంకె నాయకుడు రాందాసుకు చెందిన మక్కల్ టీవీ నిర్మించింది. దీన్ని మద్రాసు హైకోర్టులో సవాల్ చేయాలని ముత్తులక్ష్మి నిర్ణయించుకుంది. ఈ సీరియల్ ప్రసారమైతే తన కుటుంబం ఇబ్బందుల పాలవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
తన భర్త వీరప్పన్ గురించి గౌతమ్ తనతో మాట్లాడారని, తాను అనేక రహస్యాలు చెప్పానని, వాటిని గౌతమ్ రహస్య కెమెరాతో చిత్రీకరించారని ఆమె చెప్పారు. తమపై ఉన్న కేసులు న్యాయస్థానంలో పరిష్కారం కాక ముందే సీరియల్ రావడం వల్ల తమకు జైలు శిక్ష పడితే ఎవరు బాధ్యులని ఆమె అంటున్నారు. ఇప్పటికి తమను సామాన్య ప్రజలు తమలో ఇముడ్సుకునే పరిస్థితి రాలేదని, ఈ సీరియల్ వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని, దాని ప్రభావం బడికి వెళ్తున్న పిల్లలపై పడుతుందని ఆమె అన్నారు. తాను వీరప్పన్ పై రాస్తున్న పుస్తకం త్వరలో పూర్తవుతుందని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications