వైయస్ రౌడీలకు రౌడీ: చంద్రబాబు


వరంగల్: వరంగల్ జిల్లా పర్యటనలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి మైలారం, శాయంపేటల్లో కాంగ్రెస్, తెరాస కార్యకర్తలు ప్రయత్నించారు. మైలారంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.

శాయంపేటలో కూడా చంద్రబాబును అడ్డుకోవడానికి ప్రయత్నం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తల తీరుకు సహనం కోల్పోయిన చంద్రబాబు ఇది పులివెందుల కాదు శాయంపేట, ప్రతి మూడు నెలలకు ఒకసారి వస్తా ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నారు. కార్మిక భవనులో జరగాల్సిన చేనేత కార్మికుల సమావేశం జరిగే పరిస్థితి లేదు. పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి రౌడీలకు రౌడీ అని, పోలీసులను అడ్డుపెట్టుకుని తన పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+