బాలకృష్ణ కాల్పులు కేసులాగా చేయం: వైయస్
హైదరాబాద్: సినీనటుడు బాలకృష్ణ కేసు మాదిరిగా కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రశాంత్ రెడ్డి కేసుపై నిష్పాక్షికంగా విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. ఈ మేరకు రాజశేఖర రెడ్డి తనకు హామీ ఇచ్చినట్లు ప్రశాంత్ రెడ్డి భార్య విలాసిని మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఆమె శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిసి తన భర్త మృతి కేసులో తనకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
ప్రశాంత్ రెడ్డి మృతి కేసులో సిబిఐ దర్యాప్తు అవసరం లేదని, సిఐడి నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆమె తెలిపారు. తన భర్త ప్రశాంత్ రెడ్డి మృతి కేసు పక్కదారి పట్టకుండా చూడాలని ఆమె ముఖ్యమంత్రిని కోరారు. న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, తనకు ముఖ్యమంత్రిపై నమ్మకం ఉందని ఆమె చెప్పారు. ప్రశాంత్ రెడ్డి పిసిసి మాజీ అధ్యక్షుడు కె. కేశవరావు కుమారుడు వెంకట్ ఇంట్లో కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications