రాజమండ్రిలో భారీ పేలుడు: ఒకరు మృతి
రాజమండ్రి: రాజమండ్రిలో శుక్రవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ప్రాథమిక సమాచారం మేరకు - పేలుడులో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. రాజమండ్రిలోని దేవీచౌక్ లో ఈ పేలుడు సంభవించింది. మండపానికి కేవలం 20 అడుగుల దూరంలో గల ఒక ఇంటిలో ఈ పేలుడు జరిగింది.
ఇంటిలోని సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. ఇంటిలో పెద్ద యెత్తున మంటలు లేచాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక దళానికి చెందిన శకటాలు చేరుకున్నాయి.












Click it and Unblock the Notifications