త్వరలో మంత్రివర్గ విస్తరణ: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) చైర్ పర్సన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచనప్రాయంగా వెల్లడించారు. మంత్రివర్గంలో యువతకు ప్రాధాన్యం ఉంటుందని ఆమె శుక్రవారంనాడు అన్నారు. మంత్రివర్గ విస్తరణపై మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేస్తే ఆ విషయాలు ప్రధాని చూసుకుంటారని, తాను ప్రధాని వ్యవహారాల్లో పెద్దగా జోక్యం చేసుకోబోనని ఆమె అన్నారు.
అమెరికాతో అణు ఒప్పందం విషయంలో వామపక్షాలతో చర్చలు ఫలిస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పట్లో మధ్యంతరం ఉండబోదని సోనియా గాంధీ కూడా స్పష్టం చేశారు. అణు ఒప్పందం వల్ల లాభమే కాని నష్టం ఉండదని ఆమె అన్నారు. ప్రభుత్వ పనితీరు సంతృప్తికరంగా ఉందని ఆమె అన్నారు. సంకీర్ణ ధర్మానికి లోబడి పనిచేస్తామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications