చిరంజీవి విషయం జోగయ్యకే తెలుసు: జిఎస్ రావు


హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవిని కాంగ్రెసులోకి ఆహ్వానించిన విషయం తనకు తెలియదని, ఆ విషయం తమ పార్లమెంటు సభ్యుడు చేగొండి హరిరామజోగయ్యకే తెలుసునని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) తాత్కాలిక అధ్యక్షుడు జి.ఎస్.రావు అన్నారు. రాజకీయ ప్రవేశంపై చిరంజీవి ఇప్పటి వరకు ఏ ప్రకటనా చేయలేదని, అందువల్ల తాను ఆ విషయంపై స్పందించబోనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

మధ్యంతర ఎన్నికల హడావిడి అంతా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిదేనని, తమది కాదని ఆయన అన్నారు. మధ్యంతర ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కొత్త పథకాలు ప్రకటిస్తున్నారనే వాదనను ఆయన వ్యతిరేకించారు. తమ ప్రభుత్వం గత మూడేళ్లుగా ఇదే రీతిలో పని చేస్తోందని, ఇప్పుడు కొత్తగా చేస్తున్నదేమీ లేదని ఆయన అన్నారు. తాము ప్రజల కోసం పథకాలను అమలు చేయడానికి కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+