ఏనుగుల దాడిలో బాలుడి దుర్మరణం
విజయనగరం: విజయనగరం జిల్లాలోని గిరిజన ప్రాంతంలో గల నాగరకుంటబాయి గ్రామంలో ఏనుగుల దాడిలో ఒక బాలుడు మరణించాడు. గురువారం అర్థరాత్రి ఏనుగుల గుంపు గ్రామంపై దాడి చేశాయి. అదిలించేందుకు ప్రయత్నం చేయడంతో ఏనుగులు 15 ఏళ్ల ప్రభాకర రావు అనే బాలుడిపై దాడి చేసి చంపేశాయి.
ప్రభాకరరావు వ్యవసాయంలో తన తల్లిదండ్రులకు సహకరిస్తుంటాడు. ఇందులో భాగంగానే అతను ఏనుగుల గుంపును తరిమికొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటన జరిగిన ప్రాంతం కొండ ప్రాంతంలో ఉంది. దానితో శుక్రవారం ఉదయం వరకు కూడా వివరాలు సరిగా అందలేదు.












Click it and Unblock the Notifications