మధ్యంతర ఎన్నికలు రావు: ప్రధాని
న్యూఢిల్లీ: దేశంలో మధ్యంతర ఎన్నికలు రావని, తమ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. తమ ప్రభుత్వం 2009 వరకు కొనసాగుతుందని ఆయన చెప్పారు. తాను రాజకీయ నాయకుడిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని, అనుకోకుండా రాజకీయ నాయకుడిని అయ్యాయనని ఆయన చెప్పుకున్నారు. తన బాల్య స్మృతులను ఆయన నెమరేసుకున్నారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఓ సదస్సులో ఆయన ప్రసంగించారు.
అమెరికాతో అణు ఒప్పందమే తమకు అతి ముఖ్యమైంది కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ అణు ఒప్పందం అమలు జరగకపోయినంత మాత్రాన అన్నీ ముగిసినట్టుగా భావించనవసరం లేదని తేల్చిచెప్పారు. అమెరికాతో అణు ఒప్పందం అమలు జరగలేకపోవడం నిరాశరకమైందే అయినప్పటికీ, ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో దశలో వాటిని ఎదుర్కోకతప్పదన్నారు. అణు ఒప్పందం భారత్‌కు, ప్రపంచానికి ఎంతో మేలు చేసేదని అభిప్రాయపడ్డారు. అధికార సంకీర్ణంలో దీనికి సంబంధించి వస్తున్న బేదాభిప్రాయాలను తొలగించేందుకు తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications