విజయవాడలో ఉమాభారతి శరన్నవరాత్రులు
విజయవాడ: జనశక్తి పార్టీ నాయకురాలు ఉమా భారతి శుక్రవారంనాడు విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆమె 9 రోజుల పాటు కూడా విజయవాడలోనే ఉండి శరన్నవరాత్రులు ఇక్కడే జరుపుకుంటారు. ఆమె విజయవాడలోని టూరిజం హోటల్ లో బస చేశారు. శరన్నవరాత్రుల చివరి రోజు ఆమె విజయవాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
ఇదిలా ఉంటే, ఇంద్రకీలాద్రిపై వసతుల కల్పన సరిగా లేకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండపై సమాచారం ఇచ్చేవారే లేరని, కిలోమీటర్ల కొద్ది నడిపిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. కొండపైకి దేవస్థానం వారు జర్నలిస్టులను అనుమతించడంలేదు. జర్నలిస్టులకు పాసులు ఇవ్వలేదు. ఈ విషయాన్ని మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు దృష్టికి తీసికెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ప్రధాన ద్వారం వద్ద జర్నలిస్టులు ధర్నాకు దిగారు.












Click it and Unblock the Notifications