వైయస్ వేల కోట్ల ఆస్తులను నిరూపిస్తాం: టిడిపి
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి వేల కోట్ల ఆస్తులను నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. రాజశేఖర రెడ్డి, తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆస్తులపై సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి దోషి కాబట్టి విచారణ కమీషన్ విధివిధానాలను అఖిల పక్ష సమావేశంలో నిర్ధారించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతి, అక్రమాలను తాము నిరూపిస్తామని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పదవి నుంచి తప్పుకుని ఆస్తులపై విచారణకు దోహదం చేయాలని తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తాము ముఖ్యమంత్రి రాజీనామాకు డిమాండ్ చేయడం లేదని, కేశవరావు తన కుమారుడు వెంకట్ పై కేసు దృష్ట్యా ఎలా రాజీనామా చేశారో ముఖ్యమంత్రి కూడా అదే రీతిలో రాజీనామా చేయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications