ఘోర రోడ్డు ప్రమాదంలో 7గురు దుర్మరణం
వరంగల్: వరంగల్ జిల్లా తమ్మడపల్లి వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. వరంగల్ జిల్లా జనగామ నుంచి వరంగల్ వస్తున్న లారీ తమ్మడపల్లి నుండి జనగామ వెళ్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరో గంట గడిస్తే గాని వారి పరిస్థితి గురించి స్పష్టంగా చెప్పలేమని వైద్యులంటున్నారు.
ప్రమాదం సంభవించిన సమయంలో ఆటోలో పది మంది ప్రయాణిస్తున్నారు. వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఆటో నుజ్జు నుజ్జు అయింది. మరణించినవారి దేహాలు గుర్తు పట్టరానంతగా దెబ్బ తిన్నాయి. లారీ డ్రైవర్ పారిపోయాడు. ఈ ప్రమాదంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications