నన్నేమీ చేయలేకపోయారు: చంద్రబాబు
హైదరాబాద్: తనపై కేసులకు సంబంధించిన ఫైళ్లన్నీ ప్రభుత్వం వద్దనే ఉన్నాయని, తననేమీ చేయలేకపోయారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆస్తులపై జరుగుతున్న వాదోపవాదాల నేపథ్యంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సోమవారం చేసిన ప్రకటనకు ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఘాటుగా ప్రతిస్పందించారు. ముఖ్యమంత్రి వాడకూడని పదజాలం వాడారని ఆయన అన్నారు.
తాను విచారణలకు అడ్డం కాదని, కమీషన్లన్నీ తనను అడిగే వేశారా అని ఆయన అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనపై కేసు వేసింది, తర్వాత ఉపసంహరించుకున్నదీ వైయస్ రాజశేఖర రెడ్డేనని ఆయన అన్నారు. ప్రభుత్వంలోని పెద్దలు ఇష్టారాజ్యంగా భూములను కబ్జా చేస్తున్నారని ఆయన విమర్శించారు. మైనింగు లీజుల విషయంలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications