చర్లపల్లి జైలులో ఘర్షణ: గాయపడిన ఇద్దరు
హైదరాబాద్: హైదరాబాదులోని చర్లపల్లి జైలులో ఇద్దరు ఖైదీలు ఘర్షన పడి తీవ్రంగా గాయపడ్డారు. వారు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం సాయంత్రం ఇద్దరు ఖైదీలు ఘర్షన పడ్డారు. మతిస్థిమితం లేని ఒక ఖైదీ మరో ఖైదీ కత్తితో దాడి చేశారు. దీంతో రెండో ఖైదీ కూడా మొదటి ఖైదీపై విరుచుకు పడ్డాడు.
పరస్పర దాడిలో ఇద్దరు ఖైదీలు కూడా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మహమూద్, అహ్మద్ ఖాన్ అనే ఇద్దరు ఖైదీలు ఘర్షణ పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని ఆపడానికి ప్రయత్నించిన కానిస్టేబుళ్లు స్వల్పంగా గాయపడ్డారు.












Click it and Unblock the Notifications