వ్యాపారుల కాల్చివేతలో పది మంది పోలీసులు దోషులు
న్యూఢిల్లీ: ఇద్దరు అమాయక వ్యాపారుల కాల్చివేత కేసులో పది మంది పోలీసులను ఢిల్లీ కోర్టు దోషులుగా నిర్ధారించింది. సస్పెండ్ అయిన అసిస్టెంటు పోలీసు కమీషనర్ ఎస్. ఎస్. రథితో పాటు పదిమంది కోర్టు మంగళవారం దోషులుగా నిర్ధారించింది. వీరికి విధించాల్సిన శిక్షను ఈ నెల 24వ తేదీన కోర్టు ప్రకటిస్తుంది.
తప్పుడు నివేదిక ఇచ్చినందుకు రూప్ సింగ్ పై క్రిమినల్ చర్యలకు పూనుకోవాలని కోర్టు ఆదేశించింది. 1997 మార్చి 31వ తేదీన ఒక పోలీసు బృందం ప్రదీప్ గోయల్, జగ్జీత్ సింఘ్ లను కాల్చి చంపింది.












Click it and Unblock the Notifications