పివి భూములను ఆక్రమించిన సిపిఐ
కరీంనగర్: మాజీ ప్రధాని స్వర్గీయ పి.వి. నరసింహారావు భూములను మంగళవారంనాడు సిపిఐ కార్యకర్తలు ఆక్రమించుకున్నారు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం రాంనగరులో గల పివి భూముల్లో వారు ఎర్ర జెండాలు పాతారు. ఆందోళనకారులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులతో పివి కుటుంబ సభ్యులు వాగ్వివాదానికి దిగారు.
భూసంస్కరణలను అమలు చేసిన పి.వి. నరసింహారావు భూములను ఎలా ఆక్రమించుకుంటారని పి.వి. రాజేశ్వర రావు ప్రశ్నించారు. పివి భూములను ప్రభుత్వం పేదలకు పంచకపోతే తామే పంచుతామని నారాయణ అన్నారు.












Click it and Unblock the Notifications