కావూరిది తప్పేం కాదు: హరిరామజోగయ్య
ఏలూరు: వరి ధాన్యం ధర విషయంలో తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు చేసిన ప్రకటన సబబేనని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. కావూరి సాంబశివరావును ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో సమర్థించారు. వ్యవసాయ ప్రయోజనాల కోసం గాంధీ గిరి తరహా ఉద్యమాలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
రైతులు రోడ్డెక్కితే తప్ప ప్రభుత్వ దిగిరాదని కావూరి సాంబశివరావు సోమవారం ఏలూరు బహిరంగ సభలో అన్నారు. వరికి కనీస మద్దతు ధరను సాధించేందుకు రైతులు ఒక రోజు దేశాన్ని స్తంభింపజేయాలని ఆయన పిలుపునిచ్చారు. తాను అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినవాడినైనప్పటికీ రైతుల పరిస్థితిని చూసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications