నిజాం పాలన తెస్తానని అనలేదు: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిజాం పాలనను తిరిగి తెస్తామని తాను అనలేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిజాం పాలనను తెస్తామని కెసిఆర్ అన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై వ్యతిరేకత రావడంతో ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ వివరణ ఇచ్చారు.
ఎస్సీ, ఎస్టీ నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిధుల ఖర్చుకు నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ నిధులను గత తెలుగుదేశం ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పక్కదారి పట్టించాయని ఆయన విమర్శించారు. ఈ నిధుల ఖర్చుకు నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయకపోతే మిగతా పార్టీలతో కలిసి ఉద్యమాన్ని చేపడుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications