వైయస్ తీరుపై ప్రతిపక్షాల మండిపాటు
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ నిధుల ఖర్చు విషయంలో ప్రభుత్వం తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎస్సీ, ఎస్టీ నిధుల ఖర్చుకు నోడల్ ఎజెన్సీ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడాన్ని అవి నిరసించాయి. రాఘవులు (సిపియం), టి. దేవేందర్ గౌడ్ (తెలుగుదేశం), నాయని నరసింహారెడ్డి (తెలంగాణ రాష్ట్ర సమితి), జయప్రకాష్ నారాయణ (లోక్ సత్తా) తదితరులు మంగళవారం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిసి ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాయి.
నోడల్ ఏజెన్సీ ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను జవదాటారని, పైగా తాను ఆ విధమైన హామీ ఇవ్వలేదని అంటున్నారని, ఇది దారుణమని తెలుగుదేశం నాయకుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. ప్రభుత్వం దిగిరాక పోతే దళితులతో కలిసి ఆందోళనకు దిగుతామని రాఘవులు చెప్పారు. శాసనసభలో హామీ ఇచ్చి కూడా మాట తప్పడం సరి కాదని ప్రతిపక్షాల నాయకులు అన్నారు.












Click it and Unblock the Notifications