ఆంధ్రా ఆస్పత్రిపై రోగి బంధువుల దాడి
విజయవాడ: కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన ఒక బాలుడి పరిస్థితి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే విషమించిందని ఆరోపిస్తూ అతని బంధువులు ఆస్పత్రిపై దాడి చేశారు. మైలవరానికి చెందిన బాలుడికి వైద్యులు ఇంతకు ముందు అపెండిసైటిస్ ఆపరేషన్ చేశారు. అయితే బాగు కాకపోవడంతో బాలుడిని మళ్లీ ఆస్పత్రికి తెచ్చారు. వైద్యులు శస్త్రచికిత్స చేశారు.
శస్త్రచికిత్స చేసినా అతని పరిస్థితి బాగు కాలేదు. పైగా మరింత విషమించింది. అతనికి కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే బాలుడి పరిస్థితి విషమించిందని అతని బంధువులు ఆంధ్రా అస్పత్రిపై దాడి చేశారు. ఆస్పత్రి ఫర్నీచరును ధ్వంసం చేశారు. అద్దాలను పగులగొట్టారు.












Click it and Unblock the Notifications