సేతు సముద్రం ప్రాజెక్టును నిర్మిస్తాం: చిదంబరం
చెన్నై: సేతు సముద్రం ప్రాజెక్టు అమలుపై కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి చిదంబరం స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు విషయంపై వస్తున్న వివాదాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమిళనాడులోని సింగమ్‌పునరీలో సోమవారం రాత్రి చిదంబరం విలేకరుల సమావేశంలో తెలిపారు.
వివాదాలకు చోటివ్వకుండా సేతు సముద్రం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలన్నదే కేంద్ర ప్రభుత్వం ఉద్దశ్యం అన్నారు. అలాగే అణు ఒప్పందంపై సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో అక్టోబర్ 22న జరిగే యూపీఏ, వామపక్షాల కమిటీ సమావేశంలో పరిష్కరించుకోగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications