వెంకట్ కు షరతులతో కూడిన బెయిల్
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రశాంత్ రెడ్డి మృతి కేసులో పిసిసి మాజీ అధ్యక్షుడు కె. కేశవరావు కుమారుడు వెంకట్ కు రాష్ట్ర హైకోర్టు బుధవారంనాడు షరతులతో కూడిన బెయిల్ మంజురు చేసింది. వారానికి ఓ సారి సిఐడి పోలీసుల ముందు హాజరు కావాలని హైకోర్టు షరతు విధించింది. 25 వేల రూపాయల పూచీకత్తు షరతును కూడా హైకోర్టు విధించింది.
ఇంతకు ముందు నాంపల్లి కోర్టు వెంకట్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. దాంతో వెంకట్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. వెంకట్ ఇంట్లో జరిగిన కాల్పుల్లో ప్రశాంత్ రెడ్డి మరణించిన విషయం తెలిసిందే. దీంతో వెంకట్ పై హత్యానేరం కింద కేసు నమోదైంది.












Click it and Unblock the Notifications