కర్నూలు కోర్టులో హాజరైన బాల సాయిబాబా
కర్నూలు: చెక్ బౌన్స్ కేసు విచారణలో బాల సాయిబాబ బుధవారంనాడు కర్నూలులోని కోర్టులో హాజరయ్యారు. ఈ కేసు విచారణ వచ్చే ఏడాది 3వ తేదీకి వాయిదా వడింది. ఇంతకు ముందు పలు మార్లు కోర్టు బాల సాయిబాబాకు వారెంట్లు జారీ చేసింది. అయినా ఆయన కోర్టుకు హాజరు కాలేదు. ఎట్టకేలకు బుధవారంనాడు హాజరయ్యారు.
తన వద్ద తీసుకున్న అప్పుకు బాల సాయిబాబా 44 లక్షల రూపాయలకు చెక్ ఇచ్చారని, ఆ చెక్కు చెల్లలేదని శివప్రసాద్ అనే వ్యక్తి కేసు వేశారు. చెక్ మీద బాబా సంతకం చేయలేదని ఆయన తరఫు న్యాయవాది చెబుతున్నారు. ఇదే విషయాన్ని బాబా ట్రస్టు నిర్వాహకుడు రామారావు చెబుతున్నారు. నిజానిజాలు కోర్టు విచారణలో తేలుతాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications