నా ప్రాణాలకు ముప్పు, హైకోర్టుకెళ్తా: జయ
చెన్నై: తన ప్రాణాలకు ముప్పు ఉందని అన్నాడియంకె నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆందోళన వ్యక్తం చేశారు. తనకు నూకలు చెల్లాయని డియంకె నేత, ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు స్టాలిన్ అన్నారని, దీన్ని బట్టి తన ప్రాణాలకు ఏ మాత్రం రక్షణ లేదని అర్థమవుతోందని ఆమె బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తనకు ముగ్గురు భద్రతా సిబ్బందిని మాత్రమే ఇచ్చారని, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రికి 65 మంది భద్రతా సిబ్బంది ఉన్నారని ఆమె అన్నారు.
మంగళవారంనాడు తన ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతుకుడు డియంకె కార్యకర్త అని తెలుస్తోందని, దేవుని దయవల్ల తాను ఇంకా ప్రాణాలతో ఉన్నానని ఆమె అన్నారు. తనకు తగిన భద్రత కల్పించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు ఆమె తెలిపారు. తనకు భద్రత కల్పించాలని కోరుతూ ప్రధానికి, రాష్ట్రపతికి, కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications