చిరంజీవి మాట కోసం మీడియా కాపు
హైదరాబాద్: శ్రీజ ప్రేమ వివాహం గురించి మాట్లాడడానికి చిరంజీవి అందుబాటులో లేరని మీడియాకు సమాచారం అందుతోంది. చిరంజీవి ప్రతిస్పందన కోసం మీడియా ప్రతినిధులు ఆయన ఇంటి వద్ద పెద్ద యెత్తున చేరారు. అయితే చిరంజీవి ఇంట్లో లేరని సమాచారం అందుతోంది. చిరంజీవి ఇంటి వద్ద పెద్ద యెత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. ప్రైవేట్ భద్రతను కూడా పెంచారు. విజయవాడ నుంచి కొంత మంది అభిమానులు చిరంజీవిని చూడడానికి వచ్చారు. చిరంజీవి లేరని వారికి వాచ్ మెన్ చెప్పారు.
శ్రీజ, భరద్వాజలు ఎక్కడున్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి చిరంజీవి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చిరంజీవి తల్లి ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. శ్రీజ ఉనికిని తెలుసుకోవడానికే ఆమె వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే చిరంజీవి కుమారుడు రామచరణ్ తేజ మిత్రుల ద్వారా సోదరి ఆచూకీ గురించి ఆరా తీస్తున్నట్లు కూడా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ సాయంత్రానికి చిరంజీవి తన కూతురు పెళ్లి గురించి మాట్లాడే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. శ్రీజ పెళ్లి విషయం చిరంజీవి కుటుంబ సభ్యులకు ఏ మాత్రం తెలియదని అంటున్నారు.












Click it and Unblock the Notifications