మా మీద ఒత్తిడి ఉంటుంది: చిరంజీవి కూతుర శ్రీజ
హైదరాబాద్: తమ కుటుంబం వైపు నుంచి తమ మీద ఒత్తిడి ఉంటుందని బుధవారం ప్రేమ పెళ్లి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ అన్నారు. వివాహం అనంతరం ఒక వాహనంలో నూతన దంపతులు శ్రీజ, శరీష్ భరద్వాజలతో కలిసి ప్రయాణిస్తూ ఒక ప్రైవేట్ తెలుగు టీవీ ఛానల్ ప్రతినిధి వారితో మాట్లాడారు. తన భర్త భరద్వాజ్ కుటుంబ సభ్యులపై తన కుటుంబం నుంచి ఒత్తిడి ఉంటుందని శ్రీజ చెప్పారు. తమకు మీడియా మద్దతు, పోలీసు మద్దతు కావాలని ఆమె అన్నారు.
తనకు నాన్న అంటే చాలా ఇష్టమని, తమను నాన్న చిరంజీవి ఆదరిస్తారనే నమ్మకం ఉందని ఆమె అన్నారు. తన కుటుంబ సభ్యులు తమ వివాహాన్ని అంగీకరిస్తే మంచిదని ఆమె అన్నారు. తాము ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని భరద్వాజ్ చెప్పారు. తమ ఇంట్లో కూడా పెళ్లి విషయం తెలియదని, తాము బ్రాహ్మణులమని, తమ కుటుంబంలో కులాంతర వివాహాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. పెళ్లి పత్రిక మీద మాత్రం భరద్వాజ్ తండ్రి వెంకటరమణ మూర్తి పెళ్లికి ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది.












Click it and Unblock the Notifications