ఏపీకి కేంద్రం తీపికబురు.. ఐదు మెడికల్ కాలేజీలకు రూ.1,091 కోట్లు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్య, ఆరోగ్య సేవలు మెరుగుపరచే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో నిర్మించనున్న ఐదు మెడికల్ కాలేజీలకు రూ.1,091.11 కోట్ల వయబులిటీ గ్యాప్ ఫండ్ సమకూర్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు లేఖ రాసింది.

ఈ ఐదు కాలేజీలు అమలాపురం (డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ), బాపట్లలో, నర్సీపట్నం (అనకాపల్లి), పాలకొల్లు (పశ్చిమ గోదావరి), పెనుకొండ (శ్రీ సత్యసాయి)లో ఏర్పాటు అవుతున్నాయి. వీటితో పాటు నర్సింగ్ కాలేజీలు, బోధనా ఆసుపత్రులు కూడా ఏర్పాటు కానున్నాయి. కేంద్రం ప్రాజెక్టు మొత్తం విలువలో 30 శాతం నిధులు సమకూర్చనుంది.

Andhra Pradesh medical colleges Centre Approves Rs 1 091 Crore VGF for Five Medical Colleges in Andhra Pradesh under PPP Model

వీజీఎఫ్ వివరాల ప్రకారం బాపట్లకు రూ.242.41 కోట్లు, పాలకొల్లుకు రూ.225.85 కోట్లు, నర్సీపట్నానికి రూ.219.61 కోట్లు, పెనుకొండకు రూ.215.37 కోట్లు, అమలాపురానికి రూ.187.87 కోట్లు కేటాయించనున్నారు. ఈ నిధులు ప్రైవేట్ భాగస్వాములు పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా ఉంటాయి. ప్రాజెక్టు మొత్తం వ్యయం వేల కోట్లలో ఉండగా, కేంద్ర, రాష్ట్రాల సహకారంతో ఆర్థిక భారం తగ్గుతుంది. ఈ కాలేజీలు కేవలం వైద్య విద్యకే కాకుండా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా కూడా పనిచేస్తాయి.

ఈ కాలేజీలకు సంబంధించి ప్రతి క్యాంపస్‌లో 625 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ట్రామా కేర్ సెంటర్, హాస్టళ్లు, అకడమిక్ బ్లాకులు ఉంటాయి. మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లు, 120 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు, 300 నర్సింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి కాలేజీకి 46 నుంచి 50 ఎకరాల భూమి కేటాయించారు. గతంలో కూడా కేంద్రం తొమ్మిది మెడికల్ కాలేజీలకు రూ.1,468 కోట్ల వీజీఎఫ్‌కు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.

ఏపీలో అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణపై మంత్రి మండిపల్లి ఏమన్నారంటే!
ఏపీలో అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణపై మంత్రి మండిపల్లి ఏమన్నారంటే!

ఇప్పుడు ఈ ఐదు కాలేజీలకు ప్రత్యేకంగా ఆమోదం రావడం రాష్ట్రానికి పెద్ద ఊరట. తీరప్రాంత, లోతట్టు ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపడి, విద్యార్థులకు స్థానికంగా సీట్లు అందుబాటులోకి రావడం వల్ల ప్రయోజనం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం బయటి మౌలిక వసతులు అంటే రోడ్లు, విద్యుత్, తాగునీరు వంటి సౌకర్యాలు సమకూర్చనుంది. ప్రైవేట్ భాగస్వాములు డిజైన్, నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు చేపడతారు. ఈ నిర్ణయంతో వైద్య విద్యలో సీట్ల కొరత తగ్గి, గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడానికి దోహదం చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+